23 June, 2026 | 8:34 PM

Breaking News

ఎన్నికల సంఘం ఆదేశానుసారంగా హెల్ప్ డెస్క్ ప్రారంభం   •   కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే బర్తరఫ్ చేయాలి   •   బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్   •   ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి   •   పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •  

క్వార్టర్స్‌లో అంకిత

21-06-2024 02:24 AM

న్యూఢిల్లీ: భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ అంకితా రైనా వెనెటో ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. డబ్ల్యూటీఏ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అంకిత 6 2 6 ఇరినా బారా (రొమేనియా)పై విజయం సాధించింది. తొలి సెట్‌ను సునాయాసంగా గెలుచుకున్న అంకిత.. రెండో సెట్ కోల్పోయినా.. నిర్ణయాత్మక మూడో సెట్‌లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగి విజయం సాధించింది. శుక్రవారం జరగనున్న క్వార్టర్ ఫైనల్లో సూసన్ బెండెచ్చి (స్విజర్లాండ్)తో అంకిత అమీతుమీ తేల్చుకోనుంది.