1 July, 2026 | 11:24 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

అన్నమాచార్య ఆరాధన ఉత్సవాలు

27-03-2025 12:00 AM

ముషీరాబాద్, మార్చి 26: (విజయక్రాంతి): 522వ అన్నమాచార్య ఆరాధన ఉత్సవాలను గురువారం ట్యాంక్బండ్ పై గల అన్నమయ్య విగ్రహం వద్ద అన్నమాచార్య భావనవాహిని సంస్థ వ్యవస్థాపకు రాలు పద్మశ్రీ డాక్టర్ శోభరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభ రాజు వారి శిష్యులు వెంకటేశ్వర స్వామి వేషాదరణ తో సందీప్, అన్నమయ్య వేషాధారణలో అభిరామ్‌లు భక్తులను ఆకట్టుకున్నారు. వెంకటేశ్వర స్వామి అన్నమ య్య చిత్రపటాలతో, నాదస్వరంతో వేద పండితుల సహకారంతో చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి ట్యాం క్బండ్ వద్దనున్న అన్నమాచార్య విగ్రహం వరకు చేరుకొని సుమారు గంటపాటు మ హా నగర సంకీర్తన పేరుమీద ‘హరి యువతర మీతడు, దినము ద్వాదశి నేడు, తాళ్లపాక అన్నమాచార్య, చిత్తము కొలది మరీ చెలి భాగ్యము‘ అనే అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు.

కీబోర్డుపై రాజు అజయ్ తబలాపై వాయిద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి శ్రీ పండిట్ కాశీనాథ్ మిశ్రా, శ్రీ రామ యోగిజీలు హాజరై మాధవ నామమే శరణం అని సందేశం ఇచ్చారు. కల్కి అవతారం హరి నామం విశిష్టతను వివరించారు. రానున్న వైపరీత్యాలకు కలి మలానికి విరుగుడు మందు కేవలం మాధవ నామమే అని తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి అన్నమయ్యల కు హారతి అందించి అల్పాహార ప్రసాద వితరణ చేశారు. కార్యక్ర మంలో సంస్థ ప్రతినిధులు రమణ తోపాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.