"షార్పు కిడ్స్ అబాకస్" ఆధ్వర్యములో 20వ వార్షికోత్సవ కార్యక్రమం
హనుమకొండ,(విజయక్రాంతి): షార్ప్ కిడ్స్ అబాకస్ వారి 20వ వార్షికోత్సవ కార్యక్రమం శుక్రవారం రోజు సామ జగన్మోహన్ ఏబీవీపీ భవన్ లో భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డా. తక్కలపల్లి బుచ్చిబాబు మాట్లాడుతూ పూర్వకాలం నుండి మానవులు కొత్త ఆవిష్కరణలు చేస్తూ కొత్త విషయాలు, పరికరాలు కనిపెట్టి సమాజానికి ఎంతో మేలు చేశాయి. ఏదైనా కొత్త విషయాలు కనుగొనాలంటే మెదడు బాగా షార్పుగా ఉండాలి. అందుకు అబాకస్ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి తల్లిదండ్రులు అబాకస్ నేర్పించి చాలా మంచి పని చేస్తున్నారు అని అన్నారు. శాంతి గురురాజ్ ఎంతో కష్టపడి 15 బ్రాంచ్లు నడుపుచున్నారనీ, వారిని సందర్భంగా అభినందించారు.
హన్మకొండ ఏసీపి నరసింహారావు మాట్లాడుతూ చదువుతోపాటు పిల్లలకు ఆక్టివిటి తప్పక ఉండాలనీ, తల్లిదండ్రులు పిల్లల యొక్క కదలికలు కనిపెట్టి వారిని మంచి మార్గములో నడిపించాలనీ, సైబర్ నేరాలకు దూరంగా ఉంచాలి అని అన్నారు. ప్రస్తుతం అష్టావదానం, శతావదానం సహస్రావదానం చేసేవారు లేరు. అంటే మెదడుకు పని కల్పించేవారు తక్కువగా ఉన్నారు. అందువల్ల అబాకస్ నేర్పించి పిల్లకు మంచి జ్ఞాపక శక్తి పెంపొందించుకోవలన్నారు. ఈ కార్యక్రమములో 29 మంది విద్యార్థులకు స్నాతకోత్సవము నిర్వహించడం జరిగింది. 100 మంది విద్యార్థులు వారు నేర్చుకొన్న అబాకస్ లో తమ ప్రతిభను ప్రదర్శించారు.




