కామారెడ్డి బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బత్తుల నారాయణ, బండారి సురేందర్ రెడ్డి లను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కామారెడ్డి జిల్లా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా గురువారం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలలో అధ్యక్షులుగా బత్తుల నారాయణ, ప్రధాన కార్యదర్శిగా బండారు సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా రాజు, సంయుక్త కార్యదర్శిగా భార్గవ్ చంద్ర భూపాల్, కోశాధికారిగా విఠల్రావు, లైబ్రరీ సెక్రటరీగా దేవేందర్ గౌడ్, క్రీడల కార్యదర్శిగా యాదగిరి, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులకు పోటీ ఉండటంతో ఆరుగురు పోటీలో నిలువగా ఎన్నికలు నిర్వహించారు. కార్యవర్గ సభ్యుల ఎన్నికల్లో గంగరాజు, సంజిత్, షేక్ ఇర్ఫాన్ హుస్సేన్ గెలుపొందారు. ఈ కార్యవర్గం సంవత్సరం పాటు కొనసాగుతుందని బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సూచనల మేరకు ప్రతి సంవత్సరం ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారి అమృత రావు తెలిపారు. ఈ కార్యవర్గం 2027 ఏప్రిల్ వరకు కొనసాగుతుందని ఎన్నికల అధికారి, న్యాయవాది వైద్య అమృత రావు తెలిపారు.




