ఉమర్ ఖాలీద్‌కు బెయిల్
మూడు రోజుల మధ్యంతర బెయిల్‌కు హైకోర్టు అనుమతి
న్యూ ఢిల్లీ, మే 22: ఢిల్లీ అల్లర్ల కేసు (2022)లో ఉపా చట్టం కింద అరెస్టయి జైలులో ఉన్న జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలీద్‌కు మధ్యంతర బెయిల్ లభించింది. ఖాలీద్ తల్లికి శస్త్రచికిత్స జరగనున్న నేపథ్యంలో ఆమెను కలిసేందు కుగాను అతడికి ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. ఖాలీద్ గత ఆరేళ్లుగా జైలు జీవితం గడుపుతున్నాడు.
తన మామగారి కర్మకాండలకు హాజరయ్యేందుకు, శస్త్రచికిత్స చేయిం చుకోనున్న తన తల్లిని కలిసేందుకు 15 రోజుల మధ్యంతర బెయిల్ కోరుతూ ఖాలీద్ తొలుత ట్రయల్ కోర్టును ఆశ్రయించాడు. అయితే, కోర్టు అతడి అభ్యర్థనను తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై జస్టిస్ ప్రతిభా ఎం సింగ్, మధుజైన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. జూన్ 1 ఉద యం 7 గంటల నుంచి జూన్ 3 సాయం త్రం 5 గంటల వరకు మూడు రోజులపాటు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు అనుమతించింది.
ఆ సమయంలో అతడు తన ఇంటి లోనే ఉండాలని, ఆస్రత్రిలో ఉన్న తన తల్లిని మాత్రమే కలవాలని, ఒకే నెంబర్ కలిగిన ఫోన్ వాడాలని, వేరే ఇతర ప్రదేశాలకు వెళ్లకూడదని పేర్కొంది. ఈ క్రమంలో లక్ష పూచీ కత్తు కూడా చెల్లించాలని ఆదేశించింది. అత ని కదలికలపై కఠిన నిఘా ఉంచాలని పోలీసులను ఆదేశించింది.
కాగా ఇతనిపై 2016 పార్లమెంట్‌పై అఫ్జల్ గురు దాడి సమయంలో జేఎన్‌యూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతనికి మద్దతుగా, భారత్‌కు భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ విద్యార్థులను రెచ్చగొట్టాడనే దేశద్రోహ అభియోగం కూడా మోపబడింది.
కాగా 2022 నుంచి ఇప్పటివరకు ఆరుసార్లు ఖాలీద్ వేసుకున్న బెయిల్ పిటిషన్లు తిరస్కరించగా, అత్యవసర సమయాల్లో మూడుసార్లు బెయిల్ మంజూ రు చేశారు. ఢిల్లీ అలర్లలో 53 మంది చనిపోగా, 700మందికి గాయాలయ్యాయి. 500 ఇళ్లు, 700 దుకాణాలు దగ్ధం కాగా, 753 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.






