భూ తగాదాల నేపథ్యంలో వదినపై మరిది దాడి
గట్టు ఫిబ్రవరి 25:భూ తగాదాల విషయమై సొంత వదినపై మరిది కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటనలో సదరు మహిళా తీవ్ర గాయాల పాలై పరిస్థితి విషమంగా మారిన సంఘటన గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మరి రాణి తన భర్త సవారన్న కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి చెందా డు.ఆమెకు ఒక కూతురు ఉంది.తండ్రి వారసత్వంగా వచ్చే ఆస్తి విషయంలో సవరన్న బ్రతికి ఉన్నప్పుడే తన ఆస్తి కూతురికి చెందేలా నోటరీ ద్వారా అగ్రిమెంట్ చేసుకున్నట్లు బాధితులు తెలిపారు.
అయితే సవారన్న మరణాంతరం వారి తమ్ముడు మల్లేష్ తో భూవివాదం తలెత్తింది. గ్రామ పెద్దలు, పోలీస్ స్టేషన్లో పలుమార్లు పంచాయతీ నిర్వహించిన సమస్యకు పరిష్కారం కాలేదు. ఈ క్రమంలో బుధవారం రాణి ( 45)తన కూతురికి రావలసిన పొలం వద్దకు వెళ్లగా అక్కడకు చేరుకున్న మరిది మల్లేష్ ఆమెతో గొడవకు దిగి అసభ్య పదజాలంతో దూషిస్తూ కత్తితో దాడికి పాల్పడ్డాడు.ఈ ఘటనలో రాణి తీవ్రంగా గాయపడింది.స్థానికులు గమనించి ఆమెను గద్వాల ఆసుపత్రికి తరలించారు.రాణి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర శేఖర్ గౌడ్ తెలిపారు.




