5 August, 2026 | 7:58 PM

ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న ఇన్ ఫ్లో

05-08-2026 07:24 PM

- 33 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో

ర్మూర్,(విజయక్రాంతి): శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో కొనసాగుతోంది.ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. మహారాష్ట్రలో,  ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఈ వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి  క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు 80.5 టిఎంసిలగాను ప్రస్తుతం ప్రాజెక్టులో 1076.90 అడుగులకు 37.11 టీఎంసీల నీరు నిలువ ఉంది. ప్రాజెక్టులోకి 33 వేల క్యూసెక్కుల వరకు వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి 954 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాకతీయ కాలువకు 300 క్యూసెక్కులు, ఎవాబిరేషన్  423 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231  క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.