5 August, 2026 | 7:57 PM

గ్రామాలలో మంచినీటి సమస్య పరిష్కారానికి శాశ్వత కృషి

05-08-2026 07:19 PM

గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల బాధ్యత కీలకం 

రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు 

సుల్తానాబాద్,(విజయక్రాంతి): గ్రామాలలో మంచినీటి సమస్యల పరిష్కారానికి శాశ్వత కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీడీవో దివ్య దర్శన్ రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షలు హాజరయ్యారు.

సమావేశంలో సర్పంచులు గ్రామాల సమస్యలను ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా గ్రామాలలో తాగునీటి సమస్యలను సర్పంచులు ప్రస్తావించగా సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల త్రాగునీటికీ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత డి ఈ, ఏ ఈ లకు విప్పు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

సమస్యల పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. మండలంలో రైతులకు సకాలంలో ఎస్సారెస్పీ కాలువల ద్వారా నిరందించేలా పూడికతీతలు తీసి నీరు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. గత 40, 50 సంవత్సరాలుగా కాలువలు కూడుకుపోయి రైతులు ఇబ్బందులు ఎదుర్కున్నారని దాదాపు 2000 ఎకరాలకు నీరు  అందేలా నూతనంగా ఎన్నికైన సర్పంచుల సహకారంతో జెసిబిల తో కాల్వలను పూడిక తీపించడం జరిగిందని వివరించారు. అలాగే నియోజకవర్గంలో 50 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులైన వాష్రూమ్స్, ప్రహరీల నిర్మాణం, పాస్ ఏరియాల, మంచినీటి సౌకర్యాల కల్పనకు కృషి చేశామన్నారు.