15 July, 2026 | 3:04 AM

బీహార్‌లో కుప్పకూలిన మరో వంతెన

23-06-2024 01:40 AM

పాట్నా, జూన్ 22: బీహార్‌లోని అరారియా జిల్లాలో బక్రా నదిపై నిర్మించిన ఓ వంతెన ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలింది. ఈ ఘటన జరిగి వారం రోజులు కాకముందే శనివారం ఉదయం సివాన్ జిల్లాలోని గండక్ కాలువపై నిర్మించిన 180 మీటర్ల వంతెన కుప్పకూలింది. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మూడున్నర దశాబ్దాల క్రితం వంతెన నిర్మించగా సక్రమంగా నిర్వహణ లేకపోవడంతో కూలిందని స్థానికులు చెప్తున్నారు. వంతెన కూలడంతో సివాన్ జిల్లాకు, మహారాజ్ గంజ్ జిల్లాకు మధ్య కొన్నిప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారం రోజుల వ్యవధిలోనే రెండు వంతెనలు కూలిపోవడం ఆ రాష్ట్రప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.