15 July, 2026 | 2:56 AM

పండిట్ లక్ష్మికాంత్ దీక్షిత్ మృతి

23-06-2024 01:41 AM

వారణాసి, జూన్ 22: ప్రముఖ వేద పండితుడు, అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి నేతృత్వం వహించిన పూజారి పండిట్ లక్ష్మికాంత్ దీక్షిత్ (86) వారణాసిలో శనివారం కన్నుమూశారు. జనవరి 22న నిర్వహించిన రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఈయనే దగ్గరుండి నిర్వహించారు. లక్ష్మికాంత్‌కు ఇద్దరు కుమారులున్నా రు. కొంతకాలంగా దీక్షిత్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో లక్ష్మికాంత్‌ది అందెవేసిన చెయ్యి. ఈయన స్వస్థలం వారణాసి. కొన్ని తరాలుగా వీరి కుటుంబం ఇక్కడే ఉంటున్నది. అక్కడి సంవేద మహావిద్యాలయంలో దీక్షిత్ సీనియర్ ఆచార్యుడిగా ఉన్నారు. దీక్షిత్ మృతిపట్ల ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర సంతాపం తెలిపారు. ‘సంవేద విద్యాలయంలో యజుర్వేద ఉపాధ్యాయుడు, దేశంలోని ప్రముఖ పండితుల్లో ఒకరైన పండిత్ లక్ష్మికాంత్ దీక్షిత్ మరణించారన్న చెడువార్త వినాల్సి వచ్చింది. ఆయనత నేను కాశీ విశ్వనాథ్, అయోధ్య రామాలయంలో గడిపాను. ఆయన మృతి సమాజానికి తీరని లోటు’ అని ట్వీట్ చేశారు.