15 July, 2026 | 3:16 AM

ఇన్‌స్టా సెలబ్రిటీ ఫరా మృతి

23-06-2024 01:39 AM

న్యూఢిల్లీ, జూన్ 22: ఇన్‌స్టాగ్రాం లో మిలియన్ మంది ఫాలోవర్లతో సెలబ్రెటీ అయిన ట్యూనిషియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఫరా ఇ ఖదీ శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. మాల్టా దీవిలో విహార యాత్రకు వెళ్లి న ఆమె ప్రత్యేకమైన బోటులో సముద్రంలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఆమె ఉన్నట్టుండి కార్డియక్ అరెస్ట్‌కు గురయ్యారు. వ్యక్తిగత సిబ్బంది వెంటనే ఆమెను మాల్టాలోని ఓ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతిచెందినట్లు ధ్రువీకరించా రు. ఆమె కన్నుమూశారని తెలుసుకున్న అభిమానులు, పాలోయర్లు సంతాపం తెలుపుతూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని వేడుకుంటున్నారు.