13 July, 2026 | 11:49 AM

సిద్ధుపై మరో ఫిర్యాదు

04-10-2024 01:22 AM

బెంగళూరు, అక్టోబర్ 3: ముడా కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమం త్రి సిద్ధరామయ్యపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు మరో ఫిర్యాదు అందింది. ముడా కుంభకోణానికి సం బంధించిన సాక్ష్యాధారాలను సిద్ధరామయ్య నాశనం చేశారని ఈ కుంభకోణంపై మొదట ఫిర్యాదు చేసిన ప్రజావేగుల్లో ఒకరైన ప్రదీప్‌కుమార్ ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర పేరు ను కూడా చేర్చారు. ఈ స్కాం రాజకీయ ప్రేరేపితమని సిద్ధరామయ్య మరోసారి కొట్టిపారేశారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు.