13 July, 2026 | 12:16 PM

లింగన్నపేటలో పేకాట రాయుల్ల అరెస్ట్

13-07-2026 11:02 AM

గంభీరావుపేట జులై 13(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామ శివారులోఆదివారం రాత్రి పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. లింగన్నపేట గ్రామ శివారులో పోచమ్మ టెంపుల్ దగ్గరలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా రహస్యంగా పేకాడుతున్న లింగన్నపేట గ్రామానికి చెందిన,దేవరాజ్, శ్రీనివాస్, అంతయ్య, శ్రీనివాస్, వేణుగోపాల్ ఐదుగురుని పట్టుకుని వారి దగ్గరి నుండి రూ. 21,100 నగదు, 5సెల్ పొన్స్, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సైశ్రీకాంత్ తెలిపారు.