అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
23-06-2024 01:34 AM
ముగ్గురు మృతి, 10 మందికి గాయాలు
న్యూఢిల్లీ, జూన్ 22 : అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం అర్కాన్సాస్ రాష్ట్రంలోని ఓ సూపర్ మార్కెట్‌లో ఓ ఉన్మాది కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఇద్దరు పోలీసు ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఫోర్డిసీ పట్టణంలోని మాడ్ బుచర్ గ్రోసరీ మార్కెట్‌లో జరిగిన ఈ కాల్పులతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని దుండగుడిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఉన్మాది తీవ్రంగా గాయపడ్డారని అర్కాన్సాస్ రాష్ట్ర పోలీసులు తెలిపారు. అయితే, ఉన్మాది కాల్పులు జరపడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.






