15 July, 2026 | 3:28 AM

నలుగురు పిల్లల్ని కంటే జీవితాంతం ట్యాక్స్ ఫ్రీ

23-06-2024 01:37 AM

మహిళలు 41 ఏళ్లలోపు వివాహం చేసుకుంటే రుణ సదుపాయం

న్యూఢిల్లీ, జూన్ 22: నలుగురు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలను కనే మహిళలకు హంగేరి ప్రభుత్వం ప్రత్యేకమైన ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటింది. ఎక్కువ సంతానం ఉన్న కుటుంబాలకు జీవితాంతం వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. పెద్ద కుటుంబాల నుంచి కారు కొంటే భారీ రాయితీలు ఇస్తామన్నది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని విక్టోర్ ఓర్బన్ స్వయంగా శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం హంగేరి వృత్తిపరమైన ఆర్థికపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నది. యువత పెళ్లిళ్లు చేసుకోకపోవడంతో జనాభా పెరుగుదలపై ప్రభావం చూపిస్తున్నది.

జనాభాను పెంచుకునేందుకు వలసదారులను ఆహ్వానించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. హంగేరి ప్రస్తుత జనాభా 94.4 లక్షలు కాగా,  భవిష్యత్తులో జనాభాను పెంచేందుకు పూనుకొంటున్నది. 2019 నుంచి దశల వారీగా ప్రణాళికలు అమలు చేస్తున్నది. దీనిలో భాగంగా 41 ఏళ్లలోపు వివాహం చేసుకున్న మహిళకు రాయితీపై రుణాలు అందజేస్తోంది. పెళ్లి తర్వాత ఆమె ఇద్దరు పిల్లలకు జన్మనిస్తే ఆ రుణంలో మూడోవంతును మాఫీ చేస్తోంది. తాజాగా నలుగురు.. అంతకంటే ఎక్కువ మందిని కంటే వందశాతం రుణాన్ని మాఫీ చేస్తామని ప్రకటించింది.