27 August, 2026 | 2:14 PM

Breaking News

భారత్‌కు మరో ఎల్పీజీ నౌక!

06-04-2026 01:20 AM

హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిన గ్రీన్ ఆశా

ఇప్పటి వరకు భారత్‌కు 9 నౌకలు

టెహ్రాన్, ఏప్రిల్ 5: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్‌కు మరో ఎల్పీజీ నౌక వస్తోంది. తీవ్ర ఆంక్ష లు ఉన్న హోర్ముజ్ జలసంధిని గ్రీన్ ఆశా అనే సరకు రవాణా నౌక సురక్షితంగా దా టింది. ఎల్పీజీతో ఉన్న ఈ నౌక భారత్ వైపు బయలుదేరినట్టు మీడియాలో కథనాలు పేర్కొన్నాయి.

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు దాడులు మొదలుపెట్టిన నాటి నుంచి హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ ఆంక్షల కొనసాగుతున్నప్పటికీ భారత్‌కు బయలుదేరిన పలు ట్యాంకర్లు సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటగలిగాయి. ఈ మేరకు కేంద్రం ఇరాన్‌తో చర్చలు కొనసాగిస్తోంది. తమకు హానితలపెట్టే దేశాల నౌకలకే హోర్ముజ్‌లో ఆపేస్తామని ఇరాన్ ఇప్పటికే ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్‌కు తెలిపింది.

ప్రపంచ సరకు రవాణాకు కీలకమైన బాబ్‌ఎల్ మాండేబ్ జలసంధిని కూ డా టార్గెట్ చేసే అవకాశం ఉందనే సంకేతాలిచ్చింది. ఇక ఆరు వారాలుగా గల్ఫ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో హోర్ముజ్ జలసం ధిని దాటుకుని గ్రీన్ ఆశా ఎల్పీజీ ట్యాంకర్ భారత్‌కు రావడంతో దేశంలో నెలకొన్న గ్యాస్ కొరత కొంత తీరునుంది. ఈ నౌక రాకతో ఇప్పటి వరకు భారత్‌కు 9 చమురు నౌకలు వచ్చాయి.