17 June, 2026 | 8:39 PM

Breaking News

20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •   సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలి   •  

ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం

13-02-2026 12:00 AM

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

ముషీరాబాద్, ఫిబ్రవరి12 (విజయక్రాంతి): తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చేదు జ్ఞాపకాలు అలాగే ఉన్నాయని ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేయాల్సి ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని  ఆవేదన వ్యక్తం చేశారు.

త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతు న్నాం అని, తమది ఫక్తు రాజకీయ పార్టీ కాదని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ అని స్పష్టం చేశారు. గురువారం బాగ్ లింగంపల్లి ఆర్‌టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించి న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో ఆమె మాట్లాడారు. కేసీఆర్‌ను విమర్శించాలని లేదని, కానీ పదేళ్లు అవకాశం వస్తే ఏం చేశారని ప్రశ్నించారు. ఉద్యమ సోయి లేని రేవంత్‌రెడ్డి సీఎం కావ టం మన దౌర్భాగ్యమన్నారు.

ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల వైపే ధర్మం ఉందనని, వారి కోసం పోరాటం చేస్తాం అన్నారు. ఉద్యమకారులపై లాఠీ దెబ్బ పడాలంటే ముం దు ఆ లాఠీ నా మీద పడాల్సిందే అన్నారు. ఉద్యమకారులను గుర్తించేందుకు మనం యాప్ సిద్ధం చేశామని, యాప్‌లో ఎన్‌రోల్ చేసుకొని మన ఐడెంటిటీని మనమే గుర్తించుకుందామని తెలిపారు. తెలంగాణలో ఉన్న చిన్న కాంట్రాక్టర్లకు లాభం జరగలేదు. కానీ మేఘా కృష్ణారెడ్డి అపర కుబేరుడయ్యాడని అన్నారు.

చాకలి ఐలమ్మ , మారోజు వీరన్న లాంటి ఉద్యమకారుల స్ఫూర్తితో మేం ముం దుకు సాగుతామన్నారు. ఈ సభలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి,  అమరుల ఆశయ సాధన సమితి నాయకులు సాయిరాం, ఉద్యమకారుల జేఏసీ జోగే పద్మ,  ఉద్యమకారులు సోమయ్య,  జానకిరెడ్డి,  కుమారస్వామి,  సుదం లక్ష్మి, సాజీద్,  సికిందర్, శాతవాహన యూనివర్సిటీ చైతన్య, సిద్ధారెడ్డి, ఉద్యమ నాయకులు పాల్గొన్నారు.