కరోనా మాదిరి మరో సంక్షోభం
బ్రిటన్ ప్రభుత్వ మాజీ ముఖ్య సలహాదారు సర్ పాట్రిక్ వాలెన్స్
లండన్, మే 28 : ప్రపంచ మానవాళి కరోనా తరహాలో మరో సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని బ్రిటన్ ప్రభుత్వ మాజీ ప్రధాన సలహాదారు సర్ పాట్రిక్ వాలెన్స్ స్పష్టం చేశారు. ఈ దిశగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. సంక్షోభ నివారణ ఏర్పాట్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ దిశగా సంక్షోభ నివారణపై తక్షణం దృష్టి పెట్టాలన్నారు. రాబోయే ప్రమాదాలను ముందుగా గుర్తించేందుకు తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు. తగిన స్థా యిలో వైద్య పరీక్షలు, టీకాలు, చికిత్సలు అన్నీ అందుబాటులో ఉంటే లాక్‌డౌన్, భౌతిక దూరం వంటి కఠిన చర్యల అవసరం ఉండదని పేర్కొన్నారు. 2021లో తాను చేసిన సూచనలన్నీ 2023 కల్లా అనేక దేశాల ప్రభుత్వాలు మర్చిపోయాయన్నారు.
ఇది ఆమోద యోగ్యం కాదని పేర్కొన్నారు. సైనిక అవసరాల విషయంలో ఎలాంటి అప్ర మత్తత అవసరమో సంక్షోభం కట్టడి చర్యలకు సైతం అంతే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. యుద్ధంతో నిమిత్తం లేకుండా ఆర్మీ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా సం క్షోభ నివారణ వ్యవస్థలపై దృష్టి పెట్టాలన్నారు. సంక్షోభ సమయంలో అన్ని దేశాలు కలిసికట్టుగా చర్యలు తీసుకోవాలని.. ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రపంచ ఆరో గ్య సంస్థ చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు. కాగా, రెండేళ్ల క్రితం ప్ర పంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి.. కొత్త కొత్త రూపాలను మార్చుకుంటూ మళ్లీ పంజా విసురుతోంది. మొన్నటి వరకు శాంతించిన వైరస్ మరోసారి జడలు విప్పుతోం ది. ఇటీవల సింగపూర్ సహా పలు దేశాల్లో కేసులు పెరగడం సర్వత్రా ఆందోళనకరంగా మారింది.






