22 June, 2026 | 2:36 PM

Breaking News

డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •  

కొత్తగూడ రోడ్డు ప్రమాద ఘటనలో మరొకరి మృతి

24-04-2025 09:05 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పెగడపల్లి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్క చెల్లెలు ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ గువ్వా ప్రేమేష్ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. కొత్తగూడ మండలం దుర్గారం గ్రామానికి చెందిన జంగా సంపత్, ఎల్లయ్య అన్నదమ్ముల కుమార్తెలు జంగా మౌనిక, జంగా నవ్యతో పాటు సమీప బంధువులైన గువ్వ రమేష్, జాల కార్తీక్ తో కలిసి ఇదే మండలం పొగుళ్లపల్లిలోని మేనత్త వివాహ వేడుకలో పాల్గొనేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు.

ఈ క్రమంలో కొత్తపల్లి-పెగడపల్లి గ్రామాల మధ్య వీరు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ ను ట్రాలీ ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో అక్క, చెల్లెలు మౌనిక, నవ్య ఘటనస్థలిలోనే దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడ్డ ప్రేమేష్, కార్తీక్ ను తొలిత నర్సంపేట ఆసుపత్రికి ఆ తరువాత వరంగల్ ఎంజీఎంకు తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ప్రేమేష్ చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. మృతులు ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.