23 May, 2026 | 12:50 AM

మరో 50 విమానాలకు బాంబు బెదిరింపు

28-10-2024 12:56 AM

350కు చేరిన విమానాల సంఖ్య

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: బూటకపు బాంబు బెదిరింపు సందేశాలను కట్టడికి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా వాటికి అడ్డకట్టపడం లేదు. ఆదివారం తాజాగా మరో 50 విమానాలకు బాంబు బెదిరింపు సందేశాలు అందాయి. దీంతో గడిచిన రెండు వారాల్లో బూటకపు సందేశాలను అందుకున్న విమానాల సంఖ్య 350కి చేరింది.

తాజాగా బాం బు బెదిరింపు సందేశాలను అందుకున్న వాటిల్లో ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 15 విమానాలు, ఇండిగోకు చెందిన 18 విమానాలు ఉన్నాయి. తమ సంస్థకు చెందిన 17 విమానాలు కూడా బెదిరింపు సందేశాలు అందిన ట్లు విస్తారా ప్రకటించింది.

బెదిరింపు సందేశాల సంఖ్య పెరిగిపోతుండటం తో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభు త్వం బూటకపు సందేశాలను కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సోషల్ మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది