30 July, 2026 | 9:33 AM

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

30-07-2026 08:53 AM

మంథని మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సతీష్ మాతృమూర్తి మృతికి సంతాపం

మంథని, జూలై 30(విజయక్రాంతి): మంథని మున్సిపాలిటీకి చెందిన మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సతీష్ మాతృమూర్తి ఇనుముల గౌరమ్మ ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సతీష్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గౌరమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి శ్రీధర్ బాబు, అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గౌరమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఈ ఘాడమైన దుఃఖాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రముఖులు పాల్గొని గౌరమ్మ మృతికి సంతాపం ప్రకటించారు.