calender_icon.png 1 December, 2025 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

01-12-2025 05:43:13 PM

సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు

సుల్తానాబాద్ (విజయక్రాంతి): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ ను తెచ్చిందని వీటిని వెంటనే రద్దుచేసి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు. సోమవారం సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభల గోడ పోస్టర్లను కార్మికులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అదేవిధంగా శ్రమశక్తి నీతి 2025 పేరుతోటి కార్మిక హక్కులను, సౌకర్యాలను కాలరాసే నూతన విధానాన్ని తీసుకొచ్చిందని దీన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకు పూనుకోవడం దుర్మార్గమని అన్నారు, ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో నేడు కార్మిక వర్గం అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని ఈ నేపథ్యంలో డిసెంబర్ 7, 8, 9 మూడు రోజులపాటు మెదక్ పట్టణంలో సిఐటియు తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు జరుగుతున్నాయని డిసెంబర్ 7న కార్మిక ప్రదర్శన బహిరంగ సభ ఉంటుందని ముఖ్య అతిథులుగా సిఐటియు అఖిలభారత అధ్యక్షురాలు హేమలత జాతీయ నాయకులు బి, వి, రాఘవులు, ముఖ్య అతిథులుగా పాల్గొంటారని అన్నారు.

కార్మిక వర్గ విముక్తి కోసం పోరాడుతున్న సిఐటియు రాష్ట్ర మహాసభల జయప్రదానికి అన్ని రంగాల ఉద్యోగులు, కార్మికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నేడు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ల యొక్క ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి కార్మిక వర్గమంతా చైతన్య యుతంగా ముందుకు రావాలని అందుకు ఈ రాష్ట్ర మహాసభల్లో కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సహాయ కార్యదర్శి తాండ్ర అంజయ్య, మల్లేష్, సురేష్, రాజయ్య, రామ్మూర్తి, లక్ష్మణ్, నర్సింగ్, పాపయ్య, జయరాజ్, సత్తయ్య, స్వామి, శ్రీనివాస్, మధు, ఓదెలు, రాజలింగు, నాగయ్య, రాములు, రాజేశ్వరి, న్యాతరిలక్ష్మి, గంగమ్మ, లక్ష్మి, భాగ్య, లత, సంధ్య, రామ, లత, రాజమణి, సువర్ణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.