calender_icon.png 1 December, 2025 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారిగడ్డ గ్రామ సర్పంచ్ ఏకగ్రీవం

01-12-2025 05:40:04 PM

చండూరు (విజయక్రాంతి): చండూరు మండలంలోని బంగారిగడ్డ గ్రామ పంచాయతీ పెద్దల సమక్షంలో గ్రామానికి చెందిన మహమ్మద్ సమీనా కాసింను గ్రామ పంచాయతీ ప్రజలు, ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. గ్రామ ప్రజలంతా ఏకతాటిపై నిలబడి 73 లక్షలతో దేవాలయం, గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారని హామీ ఇవ్వడంతో సర్పంచ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మహమ్మద్ సమీనా కాసిం మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపర్చుకుంటూ గ్రామ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తూ అందరి మన్ననలు పొందుతానని తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.