calender_icon.png 1 December, 2025 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారమిత విద్యాసంస్థలలో ఘనంగా గీతా జయంతి వేడుకలు

01-12-2025 05:46:04 PM

ముకరంపుర (విజయక్రాంతి): నగరంలోని పారమిత విద్యాసంస్థలలో సోమవారం గీతా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను పారమిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. భగవద్గీతలోని శ్లోకాలను విధ్యార్థులు ఆలపించి ఆకట్టుకున్నారు. అలాగే విధ్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అలరించాయి. పాఠశాల ఛైర్మన్ డాక్టర్ ఇనుగంటి ప్రసాదరావు కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులను అభినందించారు. పోషకులకు, శ్రేయోభిలాషులకు గీతాజయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  పారమిత విద్యాసంస్థల డైరెక్టర్లు   ప్రసూన, రాకేష్, రశ్మిత, అనుకర్ రావు, ప్రాచీ, వినోద రావు, వి.యు. యం ప్రసాద్, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు  ప్రశాంత్, బాలాజి, కవిత, గోపి క్రిష్ణ , శ్రీకర్, శర్మిష్ఠ సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు, విధ్యార్థులు  పాల్గొన్నారు.