21 July, 2026 | 11:08 AM

గచ్చిబౌలిలో అను ఫర్నిచర్

21-07-2026 12:00 AM

19వ ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం

హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి) : ప్రముఖ ఫర్నిచర్ సంస్థ అను ఫర్నిచర్ తన 19వ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను గచ్చిబౌలిలో ఘనం గా ప్రారంభించింది. ఈ షోరూంను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, బిగ్‌బా స్ ఫేమ్ భరణి శంకర్ ప్రారంభించారు. కా ర్యక్రమంలో సినీ, టెలివిజన్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వినియోగదారులు పెద్ద సం ఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అను ఫర్నిచర్ మేనేజింగ్ డైరెక్టర్ రమణరెడ్డి మా ట్లాడుతూ.. 32 ఏళ్లుగా వినియోగదారుల విశ్వాసంతో సంస్థ అభివృద్ధి చెందుతూ ప్ర స్తుతం 19వ స్టోర్‌ను ప్రారంభించామని తెలిపారు. డైరెక్టర్ భరత్ అవినాష్‌రెడ్డి మాట్లాడు తూ.. హైదరాబాద్, బెంగళూరులో విజయవంతంగా స్టోర్లు నిర్వహిస్తున్నామని, ప్రస్తు తం సంస్థ ద్వారా సుమారు 600 మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. డైరెక్టర్ అక్షిత మాట్లాడుతూ నాణ్యత, నమ్మకం, ఉత్త మ సేవలతో అంతర్జాతీయ ప్రమాణాల ఫర్నిచర్ను అందిస్తున్నామని తెలిపారు.