21 July, 2026 | 5:11 PM

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

21-07-2026 10:25 AM

సంగారెడ్డి జిల్లాలో ఎలా జరిగింది ఈ ప్రమాదం?

కల్హేర్ సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా(Sangareddy) నిజాంపేట్ మండలం బాచేపల్లి 165 నేషనల్ హైవే వద్ద మహారాష్ట్ర నాందేడ్ నుంచి హైదరాబాద్(From Nanded, Maharashtra to Hyderabad) వస్తున్న స్కార్పియో వాహనం ఉదయం 3:45 కు డివైడర్ను ఢీకొని రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. అందులో ప్రయాణిస్తున్న  ఇద్దరు అక్కడే చనిపోగా మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. 

డివైడర్‌ను ఢీకొన్న స్కార్పియో.. ముగ్గురు మృతి

పోలీసుల వివరాల ప్రకారం, వారు ప్రయాణిస్తున్న కారు బాచుపల్లి వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడింది. హజ్ వెళ్లి తిరిగి వస్తున్న తమ కుటుంబాన్ని తీసుకునేందుకు వారు నాందేడ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు(Shamshabad Airport) వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని చికిత్స కోసం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ప్రమాదంపై కల్హేర్ పోలీసుల దర్యాప్తు

కల్హర్ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


సంగారెడ్డి రోడ్డు ప్రమాదంలో ఎంతమంది మృతి చెందారు?

సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలం బాచేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

Related Articles.....

సంగారెడ్డిలో లారీని ఢీకొన్న కారు: ఇద్దరు మృతి

దమ్మాయిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం

ఘట్‌కేసర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆ గ్రామాల్లో విషాదఛాయలు

లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం