13-02-2026 04:41:01 PM
పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్
మునుగోడు,(విజయక్రాంతి): లేవీలో అక్రమాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మునుగోడు ప్రాంతంలోని ఒక మిల్లుకు నోటీసు అందజేసి మాట్లాడారు.లేవీ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.లేవీ బియ్యం సేకరణ, నిల్వ , సరఫరా ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, ఏ విధమైన అక్రమాలు గమనించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.