15 June, 2026 | 7:23 PM

Breaking News

రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •  

పవన్ కల్యాణ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శ

29-09-2025 01:36 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 28(విజయక్రాంతి): వైరల్ జ్వరంతో బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సీఎం చంద్రబాబునాయుడు పరామర్శించారు.ఈ సందర ్భంగా పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం జ్వరం తీవ్రత తగ్గిందని, అయితే ఎడతెరిపి లేకుండా వస్తున్న దగ్గు ఇబ్బంది పెడుతోందని పవన్ సీఎంకి వివరించారు. వైద్య పరీక్షల అనంతరం, దీర్ఘకాలిక బ్రాంకైటిస్ కారణంగానే దగ్గు, గొంతు నొప్పి వస్తున్నట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని చంద్రబాబు పవన్‌కల్యాణ్‌కి సూచించారు.