29-09-2025 01:37:52 AM
-ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రశంసలు
-చత్‌పూజకు యునెస్కో గుర్తింపు కోసం కృషి
-భగత్ సింగ్, లతా మంగేష్కర్‌లకు నివాళి
-భారత పుత్రికలపై పొగడ్తల వర్షం
-126వ మన్‌కీబాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: గాంధీ జయంతి రోజు ఖాదీ వస్త్రాలే ధరించాలని ప్రధాని మోదీ భారతీయులకు పిలుపునిచ్చారు. ఆదివారం రేడియో కార్యక్రమం మన్‌కీబాత్ 126వ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. ఈ సం దర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ‘అక్టోబర్ 2న గాంధీ జయంతి ఉంది. ఖాదీకి తగిన గుర్తింపు లేకపోవడం దురదృష్టకరం. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఖాదీ ఉత్పత్తి కొనుగోలు చేయాలి. ఆ రోజు అందరూ ఖాదీ వస్త్రాలే ధరించాలి. సోషల్ మీడియాలో వోకల్ ఫర్ లోకల్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ఖాదీ వస్త్రాలను షేర్ చేయాలి.
విజయదశమి రోజునే రాష్ట్రీ య స్వయం సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రారంభమైంది. స్వాతంత్రోద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్ విశేష కృషి చేసింది. త్వరలోనే ఆర్‌ఎస్‌ఎస్ వందేండ్ల ఉత్సవం జరుపుకోబోతుంది. ఈ వంద సంవత్సరాలుగా సమాజానికి ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న సేవలు అమోఘం. సమాజం లోని ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాలు ఆర్‌ఎస్‌ఎస్ పెంపొందిస్తోంది. మహర్షి వాల్మీకి భరతజాతికి ఎంతో సేవ చేశారు. అయోధ్య రామాలయంలో వాల్మీకి మందిరం కూడా నిర్మించాం. ఛత్‌పూజ రోజున సూర్యుడిని పూజించడం గొప్ప విషయం.
ఛత్‌పూజను యునెస్కో సాంస్కృతిక కార్యక్రమంలా గు ర్తించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. కోల్‌కతా దుర్గా పూజను ఇప్పటికే యునెస్కో గుర్తించింది. నావికాదళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులు సమద్రగర్భంలో చూపుతున్న తెగువ ప్రశంసనీయం. కఠిన పరిస్థితులు ఉన్నా కానీ వా టిని తట్టుకుంటూ భారత పుత్రికలు సమర్థవంతంగా ముందుకు సాగుతున్నారు. దేశ స్వాతంత్య్రం కోసం భగత్ సింగ్ ఉరికంబం ఎక్కారు. ఉరి తీసే ముందు ఆయన ఆంగ్లేయులకు రాసిన లేఖ సాహసానికి నిదర్శ నం. ప్రముఖ గాయని లతామంగేష్కర్ పాడి న దేశభక్తి గీతాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రపంచ ఆర్థిక రంగం అస్థిరతను, అనిశ్చితిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం మనం సొంత ఆర్థిక ప్రయోజనాల విషయం లో అప్రమత్తంగా ఉండాలి. స్వదేశీ ఉత్పత్తుల వాడకానికి పెద్దపీట వేయాలి’ అని మోదీ తెలిపారు.