హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు.. వర్షంలో ర్యాలీ
05-07-2024 08:47 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు చేరుకున్నారు. రెండోసారి ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక చంద్రబాబు తొలిసారి నగరానికి వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. బాబుకు గజమాలతో స్వాగతం పలికిన పార్టీ అభిమానులు బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. వర్షంలోనూ చంద్రబాబు ర్యాలీ కొనసాగుతుంది. బాబు రాకకు తెలంగాణ పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ పర్యటన ముగియడంతో ఆయన నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం 4 గంటలకు ప్రజాభవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు.






