ఏపీ లిక్కర్ స్కాం కేసు.. పోలీసుల సోదాలు
- ఉప్పరపల్లి సన్ రైస్ విల్లాస్‌లో రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ
- 11 వ తేదీ విచారణకు హాజరుకావాలని సూచన
రాజేంద్రనగర్, మే 9: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసులో అక్కడి పోలీసులు శుక్రవారం రాజేంద్రనగర్ లోని ఉప్పరపల్లిలో ఉన్న సన్ రైస్ విల్లాస్ లో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏపి పోలీసులు విల్లా నెంబర్ 9 లో ఉంటున్న పల్లెకూరి కృష్ణమోహన్ రెడ్డి, ఆయన కుమారుడు రోహిత్ రెడ్డి కి లిక్కర్ స్కాం కేసుకు సంబంధం ఉందని సో దాలు నిర్వహించారు. పల్లెకూరి కృష్ణమోహన్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన కుమారుడు రోహిత్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఈనెల 11న విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్కాం కేసులో పోలీసులు చాలామందిని విచారించారు.






