10-05-2025 12:00:00 AM
మహబూబ్‌నగర్ మే 9 (విజయ క్రాంతి) : ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించకపోతే సంబంధిత అధికారుల హడావుడి అంతా ఇంతా ఉండదు.. మీ ఇంటికి కరెంటు కట్ చేస్తాం. వెంటనే బిల్లు చెల్లించండి.. ఎ లాంటి నోటీసులు ఇవ్వం.. ఇలా సవాలచ్చా నిబంధనలు చెబుతూ విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తారు.. ప్రజల సైతం ఇది నిజమే కదా... కరెంట్ బిల్లు ప్రతినెల కట్టాల్సిందే అంటూ మౌనం గా ఉంటారు.
ఇక్కడ 100 రూపాయల లోపు చెల్లించని కరెంట్ బిల్లు కట్ట కుంటే విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తున్న అధికారులు. అన్ని విషయాల్లో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు ప్రజల్లో రోజురోజుకు పొందుకుంటున్నాయి. అదే జడ్చర్ల పట్టణంలో ఉన్న నల్లకుంటకు సంబంధించిన భూభాగంలో ఇతరులు రేకులు అడ్డం పెట్టి ఇది మాభూమి అంటు నిబంధనలు అధికమిస్తున్న ఎందుకు పట్టించుకోవడంలేదని జడ్చర్ల పట్టణవాసులు అసహనం వ్య క్తం చేస్తున్నారు.
నల్లకుంట లో పోసిన మట్టి ని వెంటనే తొలగించి యధావిధిస్తానానికి తీసుకురావాలని గతంలో కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని తెలియపరు స్తూ మార్చి 20వ తేదీన విజయ క్రాంతి దినపత్రికలో ’నల్లకుంటను కాపాడుదెవరు’ అనే కథనం ప్రచురితమైంది.ఈ విషయంపై జడ్చ ర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, సంబంధిత అధికారులు స్పందించారు.
అధికారులు స్పం దించిన విషయాన్ని కూడా మార్చి 24వ తేదీన విజయ క్రాంతి దినపత్రిక కథనం ప్ర చురితం చేసింది. వారం రోజుల్లో నల్లకుంటలో పోసిన మట్టిని తొలగించి యధావిధి స్తానానికి తీసుకువస్తామని ప్రకటనలు చేశారు. రెండు నెలలు గడుస్తున్నా కూడా అధికారుల అడుగు నల్లకుంట లో పడలేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి.
చెప్పిందేమిటి....
నల్లకుంట లో పోసిన మట్టిని తీసి యధావిధిస్తానని తీసుకురావాలని కోర్టు ఉత్తర్వు లు జారీ చేసిన తర్వాత నెలల సమయం తీసుకున్న అధికారులు నల్లకుంట యధావిధి ఇస్తానని తీసుకువచ్చేందుకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. స్పందించాల్సిన అధికారుల స్పందించకుంటే ప్రజలు మరి ఎవరికి చెప్పుకోవాలని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నల్లకుంట జడ్చర్ల పట్టణంలో మధ్యలో ఉండటంతో ఈ ప్రాంతంలో భూ మికి చాలా డిమాండ్ కూడా ఉంది. దీంతో ఏప్రిల్ పరిధిని పూర్తిస్థాయిలో యధావిధిస్తానానికి తీసుకువస్తామని చెబుతున్న అధి కారులు మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని పట్టణవా సులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్ ఉత్తర్వుల మేరకు...
నల్లకుంట లో పోసిన మట్టితో పాటు అ క్కడ ఎవరు ఉన్నా కూడా తొలగించేందుకు పూర్తిస్థాయిలో సర్వే చేయించి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పూర్తి నివేదికను ఉన్నత అధికారులకు నివేదించడం జరిగింది. జిల్లా కలెక్టర్ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు మున్సిపల్ కార్యాలయం కు సమాచారం అందించి అవసరమైన చర్య లు తీసుకుంటాం.
రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్ర క్రియను పూర్తి చేయాల్సి ఉంది. మరో రెం డు మూడు రోజుల్లో ఉత్తర్వులు అందే అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో ఉన్నతాధి కారుల ఆదేశాల మేరకు ముందుకు సాగుతాం.
మధు, ఏఈఈ, ఇరిగేషన్ శాఖ
-నిర్మాణాలు చేపట్టొద్దని ఆదేశిస్తాం
ఇప్పటివరకు నల్లకుంటకు సంబంధించి ఇలాంటి ఉత్తర్వులు తమకు అం దలేదు. అందినప్పటికీ కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఉత్తర్వులు మాకు అంది అవకాశం ఉంది. ఉత్తర్ల మేరకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటాం.
లక్ష్మారెడ్డి, మున్సిపల్ కమిషనర్, మహబూబ్‌నగర్