calender_icon.png 12 May, 2025 | 9:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షాపింగ్‌మాల్‌లో భారీ అగ్నిప్రమాదం

10-05-2025 12:00:00 AM

- కిలోమీటర్ మేర స్తంభించిన వాహనాలు

- ఉరుకులు, పరుగులు తీసిన జనం

రాజేంద్రనగర్, మే 9: శేరిలింగంపల్లి చందానగర్ గంగారాంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం సెంట్రో షాపింగ్ మాల్ లో ఒక్కసారిగా మంటలు ఎగి సిపడటంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

మంటలు, దట్టమైన పొగ రావడంతో మాల్ లో బయటకు పరుగులు తీశారు. సెంట్రో షాపింగ్ మాల్ లో మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు.. అందరు  చూస్తుండగానే కంప్లెక్స్ మొత్తం వ్యాపించాయి. దాని నుండి పక్కనే ఉన్న ఆర్.కె కలెక్షన్ షోరూమ్ కి కూడా వ్యాపించాయి.

రెండు షోరూమ్స్ మంటల్లో చిక్కుకొని పోవడంతో ఫైర్, పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.భారీ అగ్ని ప్రమాదంతో రహదారిపై సుమారు కిలోమీటర్ పై గానే వాహనాలు స్తంభించాయి. అ యితే సెంట్రో షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తినష్టం జరిగిందని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అగ్నిప్రమాదం ఎలా జరిగింది అనే విషయం కూడా తెలియలేదు.