మల్‌రెడ్డికి బుజ్జగింపులు..
- మంత్రివర్గ విషయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు దక్కని బెర్త్
అసంతృప్తి నేతల వద్దకు అధిష్ఠానం దూతలు
మల్‌రెడ్డి రంగారెడ్డితో భేటీ అయిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
రంగారెడ్డి,జూన్ 8 (విజయక్రాంతి): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మళ్ళీ నిరాశ ఎదురైంది. మం త్రివర్గ విస్తరణ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉమ్మడి జిల్లా ఆశావాహుల ఎమ్మెల్యేలు మంత్రివర్గ విస్తరణలో చోటుదక్కగా పోవడంతో తీవ్ర నైరాశంలో మునిగిపోయారు. రంగారెడ్డి జిల్లా నుంచి ప్రస్తుతం ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న ఎవరికి క్యాబినె ట్లో చోటు దక్కలేదు.
మంత్రివర్గ విస్తరణలో తప్పనిసరిగా తమకు బెర్త్ కన్ఫామ్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇబ్రహీంప ట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కి మళ్లీ చు క్క ఎదురయింది.రాజకీయ సమీకరణల కా రణంగా అవకాశం దక్కలేదు. గత కొంతకాలంగా మంత్రి పదవి దక్కించుకోవడం కో సం మల్రెడ్డి రంగారెడ్డి ఢిల్లీలోనే మకాం వేశా రు. తనకు ఉన్న పలుకుబడిని సైతం ఉపయోగించి అధిష్టాన పెద్దలను కలిసి మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం కల్పించాలని వేడుకున్నారు.
తీరా అధిష్టానం ముగ్గురి కే మంత్రివర్గ విస్తరణ లో చోటు కల్పించడంతో మల్రెడ్డి రంగారెడ్డి తీవ్ర నైరాశంలో మునిగిపోయారు. మంత్రివర్గ విషయంలో తమ నేతకు పదవి దక్కుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్న నియోజకవర్గ పార్టీ నేత లు... తమ నేతకు పదవి దక్కకపోవడంతో వారు సైతం తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయారు.
రంగంలోనికి అధిష్టానం దూతలు....
మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని మల్రెడ్డి రంగారెడ్డి అలకబూనారు. గతంలో నే మంత్రివర్గ విస్తరణ పై ఆయన బహిరంగా పలు కామెంట్లు చేశారు. మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం దక్కపోతే ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేస్తానని ప్రకటించా రు. రాజకీయ సమీకరణల కారణంతో అధిష్టానం ఒకవేళ తనకు మంత్రివర్గా విస్తర ణలో అవకాశం కల్పించకపోతే తాను రాజీనామా చేసి...బిసి అభ్యర్థిని ఎమ్మెల్యే గా గెలి పించుకుంటానని...
అతనికి మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గ విస్తరణలో తప్పక అవకాశం కల్పించాలంటూ జిల్లా పార్టీ నేతలు సైతం ఏకవాక్య తీర్మానం చేసి పార్టీ అధిష్టానానికి లేఖ పంపారు. అయితే తాజాగా ఆదివారం మంత్రివర్గ విస్తరణలో అధిష్టానం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మ ణ్, నారాయణపేట ఎమ్మెల్యే వాకాటి శ్రీహ రి లకు మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించారు. దీంతో మంత్రివర్గ విస్తరణ పై తన భవిష్యత్తు కార్యాచరణ పై సాయంత్రం ప్రెస్ మీట్ పెడతానని మల్రెడ్డి రంగారెడ్డి ప్రకటించారు.
దీంతో అలర్ట్ అయిన పార్టీ పెద్దలు మీనాక్షి నటరాజన్ అసంతృప్తులో కూరుకుపోయిన మల్రెడ్డి రంగారెడ్డి తోని ఫోన్లో మాట్లాడి ఆయన బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆమె ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొ న్నం ప్రభాకర్ తిరుమల హిల్స్లోని మల్రెడ్డి రంగారెడ్డి నివాసం కు చేరుకొని ప్రత్యేకంగా ఆయనతో భేటీ అయ్యి ఆయనను బుజ్జగించారు. మంత్రివర్గ విస్తరణలో పార్టీ అధి ష్టానం తీసుకున్న నిర్ణయాలను ఆయనకు వివరించారు.
సామాజిక సమీకరణల కారణంతోనే మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించలేకపోయామని ఆయన వివరించే ప్రయత్నం చేశారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని భవిష్యత్తులో పార్టీ లో సముచిత స్థానం కల్పిస్తామని ఆయనకు హామీని ఇచ్చారు. అనంతరం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ చాలా రోజులు అనంతరం పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణ ప్రభుత్వం చేపట్టింది.
సామాజిక సమతుల్యతను పాటిస్తూ మంత్రివర్గ విస్తరణ జరిగింది. సీనియర్ నేత మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. అయితే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక బీసీ, ఇద్దరు ఎస్సీలకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాల్సి వచ్చిందన్నారు. మరో మూడు బెర్త్ లు ఖాళీగా ఉన్నాయని తప్పకుండా పార్టీ సీనియర్ నేతలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని ఆయన చెప్పారు.
హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు రాష్ట్ర జనాభాలో 42 శాతం ఉంది. వాస్తవంగా ఈ రెండు జిల్లాల కు అవకాశం కల్పించాల్సి ఉందన్నారు. మల్ రెడ్డి రంగారెడ్డి ఆవేదనను బాధను తానార్థం చేసుకోగలనన్నారు. పార్టీ కోసం కష్టపడిన నేతలకు భవిష్యత్తులో ఉన్నత పదవులు వ స్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.






