15 April, 2026 | 11:43 AM

మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలలో ఔట్‌సోర్సింగ్ పోస్టుకు దరఖాస్తులు

06-01-2026 09:02 PM

ఇల్లందు,(విజయక్రాంతి): ఇల్లందులోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల జూనియర్ కళాశాల (బాయ్స్–1)లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డినేట్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ముదస్సర్ హుస్సైన్ మహమ్మద్ తెలిపారు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదవ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండాలని, ఔట్‌సోర్సింగ్ విధానంలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం తప్పనిసరి అని పేర్కొన్నారు.

అలాగే ఆఫీస్ పనులపై అవగాహన, ఫైళ్ల నిర్వహణ, రికార్డు సంరక్షణలో నైపుణ్యం కలిగి ఉండడంతో పాటు ప్రిన్సిపాల్, సిబ్బందికి సహకరించే సామర్థ్యం, క్రమశిక్షణ, సమయపాలన ఉండాలని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ జీవన చరిత్ర, పదవ తరగతి సర్టిఫికేట్, అనుభవ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు ప్రతితో పాటు మొబైల్ నంబర్‌ను జతచేసి జనవరి 12, 2026 లోపు ఎం.ఆర్.ఓ కార్యాలయం పక్కన ఉన్న తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల జూనియర్ కళాశాల (బాయ్స్–1), ఇల్లందు కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.