15 April, 2026 | 1:19 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

పింగళి ప్రభుత్వ మహిళా కళాశాలలో రంగోలి పోటీలు

06-01-2026 09:07 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లిలోని పింగళి ప్రభుత్వ మహిళా కళాశాలలో రంగోలి పోటీలు సంస్కృతిక విభాగం, ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్, లెఫ్ట్నెంట్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి మాట్లాడుతూ... సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థులకు రంగోలి పోటీలను నిర్వహించామని, ఇవి వారి నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయని, విద్యార్థులు సంక్రాంతి పండుగను, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా రంగు రంగుల ముగ్గులు వేసి రంగోలి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పారు. అనంతరం అత్యుత్తమమైన రంగోలి ముగ్గులు వేసిన విద్యార్థులకు బహుమతులను ప్రకటించారు.