పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
06-01-2026 08:59 PM
తోటకూర వజ్రేష్ యాదవ్
జవహర్ నగర్,(విజయక్రాంతి): జవహర్ నగర్ సర్కిల్ పరిధిలోని బాలాజీ నగర్ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాపు (చౌక ధరల దుకాణం) ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరై రేషన్ షాపును అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేద ప్రజలకు నిత్యావసర సరుకులు చౌక ధరలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, రేషన్ షాపులు సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అలాగే కాలనీ వాసులకు ఈ సౌకర్యం అందుబాటులోకి రావడం ఆనందకరమని పేర్కొన్నారు. డీలర్ రజిత గోపాల్ గారిని అభినందించారు.






