24 August, 2026 | 11:40 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ దరఖాస్తుల ఆహ్వానం

21-06-2025 12:00 AM

ఈ నెల 23 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్, జూన్ 20 (విజయ క్రాంతి) ః సివిల్స్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధమవుతున్న తెలంగాణలోని అభ్యర్థులకు ఆర్థిక సమస్యలను తొలగించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచనతో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నట్టు సీఎండీ ఎన్.బలరామ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇటీవల విడుదలైన సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన తెలంగాణ అభ్యర్థులకు ఈ పథకం కింద ఒక్కొక్కరికీ రూ. లక్ష నగదు ప్రోత్సాహకాన్ని అందించేందుకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 23 వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు వెల్లడించారు.