24 August, 2026 | 10:30 PM

Breaking News

పరుశురాంపల్లిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలి   •   అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •  

రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ

21-06-2025 12:00 AM

వనపర్తి టౌన్, జూన్ 20 :  రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు చక చక జమ అవుతున్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 16 నుండి రోజుకు కొంత మంది రైతులకు ఎకరాల చొప్పున రైతు భరోసా జమ చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం నాడు వనపర్తి జిల్లాలో అయిదు ఎకరాల వరకు ఉన్న 11476 మంది రైతుల ఖాతాల్లో రూ. 30,05,62,758/- లు జమ చేసినట్లు తెలియజేశారు.  కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులు, ఇప్పటి వరకు రైతు భరోసా పొందని రైతులు సంబంధిత వ్యవసాయ విస్తీర్ణాధికారిని సంప్రదించాలని ఆయన ప్రకటన ద్వారా కోరారు.