25 February, 2026 | 12:23 AM

దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి

24-02-2026 01:11 AM

కలెక్టర్ కె.హరిత 

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి23(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖా స్తులను సత్వరమే పరిష్కరించేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్ తో కలిసి అర్జిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

ఈ సందర్భంగా ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ప్రజావాణి కార్యక్రమానికి సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు.