రూపాయి పల్లెది.. అకౌంట్ బంధువులది!
స్థానిక సంస్థల నిధులు పక్కదారి
- బడంగ్‌పేట మున్సిపాలిటీ పరిధిలో రూ.122 కోట్ల స్కామ్
- పంచాయతీల్లోనూ భారీగా నిధుల దుర్వినియోగం
- పంచాయతీరాజ్ శాఖ, విజిలెన్స్ విచారణలో వెలుగులోకి
సంగారెడ్డి, జూన్ 27 (విజయక్రాంతి) : స్థానిక సంస్థల్లో అక్రమాలు తారస్థాయికి చే రాయి. నకిలీ బిల్లులు, నిధుల మళ్లింపులతో ఖాతాలు ఖాళీ అవుతుండగా.. పల్లె ప్రగతి ప్ర శ్నార్థకంగా మారుతోంది. అధికారుల నిర్ల క్ష్యం, ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో సాగుతు న్న అక్రమాలతో తీవ్ర నిరాశ నెలకొంది. బడంగ్‌పేట మున్సిపాలిటీ పరిధిలో దాదా పు రూ.122 కోట్లు పక్కదారి పట్టాయి.
ఉమ్మ డి మెదక్ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల్లోనూ 16వ ఆర్థిక సంఘం నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగం అయ్యాయి. ప్రభు త్వ సొమ్మును పక్కదారి పట్టించిన ఇంటి దొంగలపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, విజిలెన్స్ విభాగాలు ఉక్కుపాదం మోపాయి. అక్రమాలను వెలుగులోకి తేవడంతో, అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణ యాలకు ఉపక్రమించింది. గ్రామ పంచాయతీ ఖాతాల నుంచి పైసా తీయాలన్నా సర్పంచ్, ఉప సర్పంచ్‌ల డిజిటల్ సంతకా లు తప్పనిసరి చేసింది.
వ్యక్తిగత ఖాతాల్లోకి..
మంచిర్యాల జిల్లా భీమారం పంచాయతీలో తాగునీటి సరఫరా, శానిటేషన్ పనుల కోసం 16వ ఆర్థికసంఘం నిధులు రూ. 23.28 లక్షలు వచ్చాయి. ఈ నిధులను అధికారిక సంస్థలకు లేదా కాంట్రాక్టర్లకు ఇవ్వ కుండా.. 13 మంది ప్రైవేట్ వ్యక్తులు, స్థానిక ప్రతినిధుల కుటుంబసభ్యుల వ్యక్తిగత బ్యాం కు ఖాతాల్లోకి ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేశారు. గ్రామస్తుల ఫిర్యాదుతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ఒకే పనికి రెండు వేర్వేరు పథకాల కింద నిధులు డ్రాచేసి కమిషన్లు నొక్కుతున్న ట్లు ఫిర్యాదులున్నాయి. ‘సింగిల్ వర్క్ - డబుల్ ఫండ్’ దందాపై కూడా విజిలెన్స్ బృందాలు విచారణ జరుపుతున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని పలు పంచాయతీల్లో ఆర్థిక సంఘం నిధులు పెద్ద ఎత్తున నిధులు పక్కదారి పట్టాయి. పాత పాలకవర్గాల హయాంలో, ప్రత్యేకాధికారుల పాలనలో అక్రమంగా మళ్లించిన నిధుల గుట్టు రచ్చకెక్కుతోంది. సిద్దిపేట జిల్లా పుల్లూ రు పంచాయతీలో 2020 నుంచి 2024 మధ్య భారీ అక్రమాలు చోటుచేసుకున్నా యి. ప్రజావాణిలో గ్రామస్తుల ఫిర్యాదు తో కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎల్‌పీఓ విచారణ చేసి నిధుల వ్యయంలో వ్యత్యాసాలు ఉన్న ట్లు గుర్తించారు.
సంగారెడ్డి జిల్లాలోని పలు మేజర్ పంచాయతీల్లో పనులు చేయకుండానే చేసినట్లు నకిలీబిల్లులు సృష్టించి నిధు లు స్వాహా చేసిన ఉదంతాలు విజిలెన్స్ విచారణలో బయటపడుతున్నా యి. వీధి దీపాల కొనుగోలు, పంచాయతీ ట్రాక్టర్ల డీజిల్ ఖర్చులు, పారిశుధ్య రసాయనాల కొనుగో లు పేరిట నిధులు డ్రా చేశారు. మెదక్ జిల్లా పరిధిలోని పలు పంచాయతీల్లో అభివృద్ధి నిధులు, అత్యవసర ఫండ్‌ను నిబంధనలకు విరుద్ధంగా సాధారణ ఖర్చులకు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబం ధించిన రికార్డులను మాయం చేయడంతో ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టర్ల కఠిన నిర్ణయాలు
నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, ఖర్చులో పారదర్శకతకోసం సిద్దిపేట, సం గారెడ్డి, మెదక్ కలెక్టర్లు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. పంచాయతీ ఖాతా నుండి పైసా తీయాలన్నా సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరి డిజిటల్ సంతకాలు తప్పనిసరిగా ఉం డాలి. దీని వల్ల ఏకపక్ష నిర్ణయాలకు తావుండదు. కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధుల్లో సిద్దిపేట రూ.11.75 కోట్లు, సంగారెడ్డి రూ. 8.09 కోట్లు, మెదక్ జిల్లాకు రూ.5.03 కో ట్లు కేటాయించారు.
ఈ నిధులు కేవలం శా నిటేషన్, తాగునీరు, వైకుంఠధామాల నిర్వహణకు ఉపయోగించేలా ఆన్‌లైన్ ఆడిటింగ్ పరిధిలోకి తెచ్చారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు నిరూపితమైతే సస్పెన్షన్ తో పాటు రెవెన్యూ రికవరీ చట్టం కింద వారి వ్యక్తిగత ఆస్తులను జప్తుచేయనున్నారు.
ఆమోదం లేకుండా రూ.122 కోట్లు మళ్లింపు
రంగారెడ్డి జిల్లా పరిధిలోని బడంగ్‌పేట మున్సిపాలిటీ (జీహెచ్‌ఎంసీ విలీన ప్రాం తం) పరిధిలో గతేడాది డిసెంబర్‌లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. పారిశు ద్ధ్యం, ఇంజినీరింగ్ పనుల పేరిట కౌన్సిల్ అనుమతి, ప్రత్యేక అధికారి ఆమోదం గానీ లేకుండానే ఏకంగా రూ. 122 కోట్ల నిధులను ఇష్టానుసారంగా మళ్లించారు. విజిలెన్స్ విచారణలో వా స్తవమని తేలడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
డిప్యూటీ కమిష నర్‌తో సహా 10 మం ది అధికారులను ఒకేసారి స స్పెండ్ చేస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడం రా ష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొందరు స్థానిక ప్రతినిధులు, కిందిస్థాయి సిబ్బంది కుమ్మక్కై నిధులను స్వాహా చేస్తున్నారు.
అక్రమాలను అరికట్టేందుకు మూడు కొత్త నిబంధనలు
నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వే సేందుకు తెలంగాణ ప్రభుత్వం మూడు కఠి న నిబంధనలు తీసుకువచ్చింది. మొదటిది.. జాయింట్ డిజి టల్ సంతకాల సేకరణ. పం చాయతీ ఖాతా నుంచి రూపాయి తీయాలన్నా సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరి డిజిటల్ సంతకాలు తప్పనిసరిగా ఉండాలి. రెండవది ట్రెజరీ నుంచి బ్యాంక్ ఖాతాలకు మార్పు. పంచాయతీల సొంత నిధులు (ఓఎస్‌ఆర్) త్వరితగతిన ఖర్చయ్యేలా ట్రెజరీ నుంచి నేరుగా బ్యాంక్ అకౌంట్లలోకి మార్చారు.
అయితే ప్రతి పైసా ఆన్‌లైన్ ఆడిటింగ్ పరిధిలోనే ఉంటుంది. మూడవది ’వడ్డీ’ పెనాల్టీ. కేంద్రం విడుదల చేసిన 16వ ఆర్థిక సంఘం నిధులను (తెలంగాణ వాటా రూ. 9,968 కోట్లు) కేవ లం 10 రోజుల్లోగా పంచాయతీలకు బదిలీ చేయా లి. ఆలస్యమైతే రాష్ట్ర ప్రభుత్వమే వడ్డీ తో సహా చెల్లించాల్సి ఉంటుంది.






