15 April, 2026 | 4:06 AM

దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

24-06-2025 01:06 AM

జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ 

జగిత్యాల అర్బన్, జూన్ 23 (విజయక్రాంతి): ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖా స్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహిం చిన ’ప్రజా వాణి’లో జిల్లా వివిధ ప్రాంతాల నుండి 61 దరఖాస్తులు రాగా, కలెక్టర్ సత్యప్రసాద్ స్వయంగా వినతులను స్వీకరించా రు.

సంబంధిత అధికారులు సమస్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, కోరుట్ల ఆర్డీఓ జివాకర్ రెడ్డి, మెట్ప ల్లి ఆర్డీవో శ్రీనివాస్, వివిధ జిల్లా అధికారులుపాల్గొన్నారు.