15 June, 2026 | 11:09 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

అగ్నివీర్, అగ్నిపత్ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకోండి

29-03-2026 04:13 PM

నిర్మల్,(విజయక్రాంతి): భారత సైన్యంలో సేవ చేసినందుకు భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలో అగ్ని వీర్ అగ్నిపత్ ఉద్యోగుల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడల యువజన సర్వీసుల శాఖఅధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. భారత ప్రభుత్వం అగ్నిపథ్ పథకంలో భాగంగా భారత సైనిక విభాగంలో అగ్నివీర్ గా చేరుటకు పురుష అభ్యర్థుల నుండి 2027 సవత్సరమునకు గాను దరఖాస్తులను కోరుచున్నారు.

అర్హతలు: వివాహం కాని పురుష అభ్యర్థులకు మాత్రమే. 8వ తరగతి ఆ పైన చదివిన వారు, 01.07.2005 నుండి  01.07.2009 మధ్యలో జన్మించిన వారై వుండాలి. కావున ఆసక్తి అర్హత కలిగిన నిర్మల్ జిల్లాలోని యువకులు 01.04.2026 తేది లోపు (www,joinindianarmy.nic.in) webportal ద్వారా వివరములను కొరకు, దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.