21 August, 2026 | 7:47 PM

గెస్ట్ అధ్యాపకుల కోసం దరఖాస్తు చేసుకోండి

21-08-2026 06:08 PM

నిర్మల్ ,ఆగస్టు 21 ( విజయ క్రాంతి): నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల కోసం (Guest Faculty) నియామకం చేపట్టనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం సుధాకర్ తెలిపారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయుటకు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ లో వాణిజ్య శాస్త్రం సబ్జెక్టులో ఒక్క పోస్టు  ఖాళీ ఉన్నట్లు తెలిపారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉన్నవారు అర్హులుగా పేర్కొన్నారు. నెట్, సెట్, పీహెచ్.డి. అర్హతలు మరియు బోధనా అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. విద్యార్హతలు, కుల ధ్రువీకరణ పత్రం, అనుభవ ధ్రువీకరణ పత్రం తదితర అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులపై గెజిటెడ్ అధికారి సంతకంతో (Attestation) సమర్పించాలని  తెలిపారు. దరఖాస్తులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మల్ లో సమర్పించడానికి చివరి తేదీ ఆగష్టు 24, 2026 సాయంత్రం 4:30 గంటలు. అనంతరం ఆగష్టు 25, 2026 ఉదయం 11:00 గంటలకు ప్రభుత్వ డిగ్రీ  కళాశాల, నిర్మల్ ఆవరణలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.