బీసీ రాజ్యాధికారంతోనే బడుగు బలహీన వర్గాల సాధికారత సాధ్యం
తీన్మార్ మల్లన్న
చేగుంట,(విజయక్రాంతి): బీసీ రాజ్యాధికారమే ధ్యేయంగా బడుగు బలహీన వర్గాల సామాజిక ఆర్థిక రాజకీయ సాధికారత కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేగుంట పలు గ్రామాల నాయకులు, ప్రముఖులు పార్టిలొ చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించినారు. అనంతరం మేము సైతం బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పనిచేస్తాం అంటూ చేగుంట మండలం కిష్ట పూర్,బోనాల తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న చేగుంట మండలంలో పలు గ్రామంలో పార్టీ జెండాల ఆవిష్కరించారు.
బోనాల గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ బీసీ రాజ్యాధికారంతోనే బడుగు బలహీన వర్గాల సాధికారిక సాధ్యం అవుతుందని, విద్య, ఉపాధి రాజకీయ రంగాల్లో, సముచిత సానాలు కల్పించడమే తెలంగాణ రాజాధికార పార్టీ ప్రధాన లక్షమని, విద్య ద్వారానే సమజిక ఆర్థిక రాజకీయ సాధికారత సాధ్యమవుతుందని తీన్మార్ మల్లన్న అన్నారు.
ఈ కార్యక్రమంలోతెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి నగేష్ ముదిరాజ్, జిల్లా అధ్యక్షులు ఇమాంపూర్ యాదగౌడ్ మండల అధ్యక్షులు బుచ్చన్న గారి కిషన్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సిద్ధక్క, మండల ఉపాధ్యక్షులు గ్రాండ్ల ప్రవీణ్,ప్రధాన కార్యదర్శి జనగామ యాద గౌడ్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు గౌతమ్ సీనియర్ నాయకులు పోతుల రాజేష్, రవీందర్, అనిల్, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.






