21 August, 2026 | 8:06 PM

ఘనంగా శ్రావణ శుక్రవారం వేడుకలు

21-08-2026 07:24 PM

సత్తుపల్లి(విజయక్రాంతి): శ్రావణమాసం సందర్భంగా శ్రావణ శుక్రవారం పూజలు, వరలక్ష్మి వ్రతాలు మహిళలు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఇంటిని రంగవల్లులు ,పూలు మామిడి తోరణాలతో అలంకరించి అమ్మవారి విగ్రహాన్ని సాంప్రదాయ పద్ధతిలో వస్త్రధారణ చేసి అలంకరించి వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. కుటుంబము, పిల్లలు అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని,  పసుపుతో గౌరీదేవిని తయారుచేసి కలశాన్ని ఉంచి, అమ్మవారి ప్రతిమకు భక్తిశ్రద్ధలతో సాంప్రదాయం పద్ధతిలో మహిళలు పూజా కార్యక్రమాలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఆయురారోగ్యాలు,సకల సిరి సంపదలు, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు. సమృద్ధిగా  వర్షాలు కురవాలని పాడిపంటలతో, ధన ధాన్యాలతో దేశం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరారు. తోటి ముత్తైదువులకు చీర సారె, పూలు ,పండ్లు తాంబూలం వాయనంగా అందించి ఆశీర్వాదం తీసుకున్నారు.