calender_icon.png 2 February, 2026 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

02-02-2026 08:29:14 PM

భద్రాచలం,(విజయక్రాంతి): 2025-26 విద్యా సంవత్సరమునకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని అన్నీ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలలో 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్య నభ్యసిస్తున్న గిరిజన విద్యార్థినీ విద్యార్థులు ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ కొరకు www.telanganaepass.cgg.gov.in అనే వెబ్-సైటు ద్వారా ఆన్లైన్ చేసుకోవలెనని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ సోమవారం  ఒక ప్రకటనలో తెలిపారు.

 "న్యూ-స్కీమ్ డేస్-స్కాలర్స్" ద్వారా 5 నుండి 8 తరగతుల వరకు చదువుతున్న బాలురకు Rs. 1,000/- బాలికలకు Rs. 1,500/- సంవత్సరమునకు మంజురీ , "రాజీవ్ విద్యా దీవెన స్కిమ్" ద్వారా 9 & 10 తరగతులు చదువుతున్న డేస్- స్కాలర్స్ కు .రూ 2,250/- హాస్టలర్స్ కు రూ 4,500/- సంవత్సరమునకు మంజురీ అవుతాయన్నారు.  కావున విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువ పత్రములు ,బ్యాంక్ పాస్ పుస్తకము లతో పైన తెలిపిన వెబ్ సైటు ద్వారా ఈ స్కీమ్ ఈ ఏడాది మార్చి 31  లోపు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలెననీ ఆయన కోరారు.