02-02-2026 08:25:32 PM
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని బెజ్గంచెరువు తండాలో జగదంబ దేవి,సేవాలాల్ మహారాజ్ ఆలయ ప్రథమ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. పురోహితులు శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో గణపతి హోమం, పుణ్యాహవాచనం, అభిషేకం అలంకరణ పూర్ణాహుతి ప్రత్యేక పూజలు చేపట్టారు. గిరిజనుల ఆరాధ్య దైవం సేవలాల్ మహారాజ్ పీఠాధిపతి బాబు సింగ్ మహారాజ్ కార్యక్రమంలో పాల్గొని బోగుబండార్ ఆశీర్వాద వచనము వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి తాండ ప్రజలను ఆశీర్వదించారు.
చుట్టుపక్కల తాండవాసులు తదితర గ్రామాల పెద్దలు తండావాసులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నప్రసాద వితరణ చేపట్టారు.స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్,ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీధర్ గౌడ్, గుడిపల్లి రాంచంద్రారెడ్డి, వాసురెడ్డి పాల్గొని జగదంబ సేవలాల్ మహారాజ్లకు పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో పూజారి రమావత్ కిషన్ నాయక్,ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మండల అధ్యక్షుడు దేవిసోత్ రమేష్ నాయక్,ఆలయ కమిటీ అధ్యక్షులు రామావత్ బాబు నాయక్,ఉప అధ్యక్షులు తులిషా నాయక్, చాందిరాం,నాగరాజ్, ఫకీరా, ధన్ సింగ్, వర్జ,బాపు నరేష్ సురేందర్, కాంగ్రెస్ నాయకులు గంపల వెంకయ్య, దివిటీ కిష్టయ్య, ప్రభు గౌడ్, వస్త్రం నాయక్, వజ్రా నాయక్, ఇమామ్, బన్సీ, మహేష్ రెడ్డి, పాల్గొని భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు.