24 August, 2026 | 9:51 PM

ఇందిరమ్మ ఇండ్లతో పేద కుటుంబాల్లో సంతోషం

24-08-2026 06:31 PM

న్యూ దేవేందర్ నగర్‌లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం

జవహర్‌నగర్,(విజయక్రాంతి): న్యూ దేవేందర్ నగర్‌లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. జవహర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడంలో ఇందిరమ్మ ఇళ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్లేపల్లి సదానంద్, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, శంకర్ గౌడ్, వీర భాస్కర్, కొలిపాక సాయికిరణ్, మంద ఆనంద్, గజ్వేల్ శంకర్, వెంకటేష్, శ్రీను తదితర నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.