24 August, 2026 | 8:10 PM

రేపు సుల్తానాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌ లో వాహనాల వేలం పాట

24-08-2026 06:34 PM

ఎక్సైజ్ సీఐ గురునాథ్ రాథోడ్

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌లో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలకు ఈనెల 25న మంగళవారం ఉదయం 10:00 గంటలకు బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు సుల్తానాబాద్ ఎక్సైజ్ సీఐ  గురునాథ్ రాథోడ్ సోమవారం తెలిపారు. ఈ వేలం పాటను  జిల్లా ప్రొహిబిషన్ , ఎక్సైజ్ అధికారి (డి పి ఈ ఓ), పెద్దపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వేలం పాటలో పాల్గొనదలిచిన వారు తమ ఆధార్ కార్డు జిరాక్స్ వెంట తీసుకురావాలని, అలాగే తాము బిడ్ చేయదలిచిన వాహనం విలువలో 50 శాతం ఈఎండీ  మొత్తాన్ని ముందుగా డిపాజిట్ చేసి వేలం పాటలో పాల్గొనాలని సూచించారు.ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని గురునాథ్ రాథోడ్ పేర్కొన్నారు.